Abn logo
Sep 14 2021 @ 20:12PM

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రతిష్టించిన చోటే వినాయక నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ వినాయక విగ్రహాన్ని ట్యాంక్ బండ్ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తూ వచ్చారు. అయితే వినాయక నిమజ్జనానికి హైకోర్టు అనుమతి నిరాకరించింది. హుస్సేన్‌‌సాగర్‌ కాలుష్యకాసారంగా మారిందని, అందులో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆదేశించింది. ఈ ఒక్క ఏడాది వరకు పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే హుస్సేన్‌సాగర్‌పై భారం పడకుండా 25 బేబీ పాండ్స్‌ (ప్రత్యేక గుంతలు) నిర్మించామని, నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తేనే ఆదేశాలు ఇచ్చామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైదరాబాద్‌ పరిధిలోని జలాశయాల్లో రసాయనాల కాలుష్యాన్ని నిషేధిస్తూ 1955లో చేసిన జీహెచ్‌ఎంసీ చట్టంలో నిబంధనలు ఉన్నాయని హైకోర్టు  గుర్తుచేసింది. సింథటిక్‌ రంగులతో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తామని జీహెచ్‌ఎంసీ ఎలా చెబుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ చట్టాన్ని ఉల్లంఘిస్తామని కమిషనరే ఎలా చెప్తారని నిలదీసింది. కోవిడ్ ముప్పును కూడా ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. 


ఇవి కూడా చదవండిImage Caption

పీవోపీ విగ్రహాల నిమజ్జనం కుదరదు