Abn logo
Mar 6 2021 @ 15:07PM

నా ప్రవర్తన అందరికీ తెలుసు: కేశినేని నాని

అమరావతి: ఎంపీ అయ్యాక, అవ్వక ముందు తన ప్రవర్తన అందరికీ తెలుసునని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. శనివారం ముస్లింల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. విజయవాడ ఎంపీ ఓట్లు కోసం తాను పని చేయనని చెప్పారు. సమాజం మంచి కోసం పనిచేస్తానని అన్నారు. ముస్లింలకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను జగన్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం సమాజం పట్ల జగన్ అనుకూలంగా ఉండి ఉంటే ఎన్ఆర్సీపై కేంద్రం తెచ్చిన బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేవారు కాదని చెప్పారు. ఎన్ఆర్సీ బిల్లును పార్లమెంటులో టీడీపీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. విజయవాడ పరిధిలో ఎన్ఆర్సీని అమలు కానివ్వమని తెలిపారు. రూ.2వేల కోట్లతో పూర్తయ్యే అమరావతిని సీఎం జగన్ అన్యాయంగా నిలిపివేశారని మండిపడ్డారు. జగన్ వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారని కేశినేని నాని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement