Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 2 2021 @ 19:47PM

మహిళ నగ్న వీడియోలు తీసి ప్రచారం చేసిన సీపీఎం సభ్యుడు అరెస్ట్

తిరువనంతపురం: కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న కేరళలో ఓ దారుణం వెలుగు చూసింది. అధికార పార్టీకి చెందిన ఒక కార్యకర్త.. తనతో పాటే పని చేస్తున్న మహిళ కార్యకర్త నగ్న వీడియోలు తీసి ఆన్‌లైన్‌ ప్రచారం చేశాడు. నిందితుడిని చుమంత్రి ఎలిమన్నిల్ సాజిమన్ (39) గుర్తించిన పోలీసులు.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటన మే నెలలో జరిగిందట. సదరు మహిళను ఇద్దరు వ్యక్తులు కారులో తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యం చేసేందుకు పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీపీఎం శాక కార్య‌ద‌ర్శి సాజిమన్, డీవైఎఫ్ఐ నేత నసీర్‌లపై సెక్షన్ 354ఏ (అత్యాచారం), సెక్షన్ 354బీ (మహిళను బలవంతంగా వివస్త్రను చేసి నేరానికి పాల్పడటం), సెక్షన్ 294 (అసభ్యకర చర్యలు) కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సాజిమన్‌ని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement