May 9 2021 @ 17:08PM

'మరక్కార్' నుంచి కీర్తి సురేశ్ లుక్ రిలీజ్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కీర్తి సురేశ్ నటిస్తున్న సినిమా 'మరక్కర్'. మంజు వారియర్, సునీల్ శెట్టి, అర్జున్ సర్జా, సుహాసిని, నేడుముడి వేణు, ఇన్నోసెంట్, ముఖేష్, ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణి ప్రియదర్శన్ ఇతర ముఖ్యపాత్రలలో కనిపించబోతున్నారు. తాజాగా 'మరక్కార్' నుంచి కీర్తి సురేశ్ లుక్‌ను రిలీజ్ చేశారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటిసారి శాస్త్రీయ సంగీతకళాకారణి ఆర్చా పాత్రలో కనిపించబోతున్న ఈమె లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. పోర్చుగీస్ వారి దండయాత్రకు వ్యతిరేకంగా మలబార్ తీరాన్ని రక్షించడానికి నావికాదళ కమాండర్ కుంజలి మరక్కర్ ఏం చేశాడనే కథాంశంతో ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.