Abn logo
Jun 1 2020 @ 04:50AM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

అమరచింత/ ఆత్మకూరు, మే 31: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మునిసిపల్‌  చైర్‌పర్సన్‌ మంగమ్మ అన్నారు. డ్రైడేను పురష్కరించుకొని ఆదివా రం పట్టణంలోని 7వ వార్డులో ఇంటింటి పరిశీలించి నిల్వనీటిని పుర క మిషనర్‌ మోహన్‌, కౌన్సిలర్‌ పారుపల్లి ఉషారాణి పారబోశారు.


రానున్న సీజనల్‌ వ్యాధు లను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లని ప్రజలకు పిలుపునిచ్చారు. మార్కెట్‌యార్డు వైస్‌చైర్మన్‌ నాగ భూషణంగౌడ్‌ పాల్గొన్నారు. ఆత్మకూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం 10నిమిషాల పాటు ‘పరిస రాల పరిశుభ్రత’ను  చేపట్టారు.  ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement