Abn logo
Sep 4 2021 @ 17:58PM

అమిత్‌షాతో ముగిసిన కేసీఆర్ భేటీ

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. దాదాపు 35 నిమిషాల పాటు అమిత్‌షాతో కేసీఆర్‌ సమావేశం కొనసాగిందని చెబుతున్నారు. అయితే ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులను 139 నుంచి 194కి పెంచాలని అమిత్‌షాను కేసీఆర్ కోరినట్లు సమాచారం. మొత్తం కేడర్‌ బలాన్ని సాధారణంగా అనుమతి ఇచ్చే 5% పెంపునకు పరిమితం చేయకుండా 40% మేర పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ పోలీస్‌ కేడర్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపిచింది. ఐపీఎస్‌ కేడర్‌ పోస్టుల కేటాయింపులు జరిపితే ఐపీఎస్‌ అధికారులను కమిషనర్లు, ఎస్పీలు, జోనల్‌ డీఐజీ, మల్టీజోనల్‌ ఐజీపీలుగా నియమించడానికి వీలవుతుందని అమిత్‌షా దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లినట్లు సమచారం.