Abn logo
Oct 16 2020 @ 01:00AM

ఆడబిడ్డల కళ్లల్లో ఆనందమే కేసీఆర్‌ లక్ష్యం

తలకొండపల్లి/శంషాబాద్‌ : ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి  అన్నారు. మండలంలోని పాతకోట తండాలో సర్పంచ్‌ అలివేలు సోమలింగంతో కలిసి గురువారం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జుమాలి, శాంతి, శ్రీను, లక్ష్మి, గోపి, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీలోని మధురానగర్‌బస్తీలో గురువారం బతుకమ్మ చీరల పంపిణీని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి ప్రారంభించారు. కౌన్సిలర్‌ స్రవంతిశ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెంకటేశ్‌గౌడ్‌, శ్రీను, పవన్‌, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement