Advertisement
Advertisement
Abn logo
Advertisement

19 ఏళ్ల వయసులోనే కోటీశ్వరుడు అయిన ఈ కుర్రాడి లైఫ్‌లో ఎన్ని కష్టాలో.. అతడు సమాధానం తెలియక వదిలేసిన రూ.7 కోట్ల ప్రశ్న ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో పాల్గొనాలని చాలా మంది కలలు కంటారు. అందుకోసం తీవ్రంగానే కృషి చేస్తారు. కానీ కొందరికే అందులో పాల్గొనే అవకాశం దక్కుంది. ఇలా కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) షోకు వచ్చిన వాళ్లు ఎంతో కొంత గెలుచుకునే ప్రోగ్రాం నుంచి తిరిగి వెళ్తారు. ఈ కోవకే చెందిన 19ఏళ్ల సాహిల్ ఆదిత్య అహిర్‌వాల్.. కేబీసీ సీజన్ 13లో అద్భత ప్రతిభ కనబర్చాడు. ఏకంగా రూ. కోటి రూపాయలను గెలుచుకున్నాడు. ఈ క్రమంలో 16వ ప్రశ్నకు సమాధనం తెలియకపోవడంతో రూ.7కోట్లను మిస్ చేసుకున్న సాహిల్ ఆదిత్య అహిర్‌వాల్ బ్యాగ్ గ్రౌండ్‌ను ఒకసారి పరిశీలిస్తే..


మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్‌.. సాహిల్ ఆదిత్య అహిర్‌వాల్ స్వస్థలం. సాహిల్ తండ్రి పేరు బాబూ లాల్ అహిర్‌వాల్. ఈయన నోయిడాలోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సాహిల్ తల్లి సరోజ్ ఒక గృహిణి. బాబూ లాల్ అహిర్‌వాల్ సంపాదించే రూ.15వేలతోనే వారి ఇల్లు గడుస్తుంది. ఈ డబ్బులోంచి కొంత మొత్తాన్ని బాబూ లాల్ అహిర్‌వాల్.. తన పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తున్నాడు. కాగా.. సాహిల్ ఆదిత్య అహిర్‌వాల్ మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయంలో బీ.ఏ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటుండగా.. అతడి తమ్ముడు మాత్రం తల్లితో కలిసి అద్దె గదిలో ఉంటూ చదువుకుంటున్నాడు. సాహిల్ ఆదిత్య అహిర్‌లాల్ తల్లికి కొద్ది రోజుల క్రితమే కిడ్నీ ఆపరేషన్ అయింది. 


ఇదిలా ఉంటే.. బీ.ఏ చదువూతూనే సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న సాహిల్ ఆదిత్య అహిర్‌వాల్ కేబీసీ షోకు సెలెక్టై హాట్ సీట్ వరకూ వెళ్లాడు. ఈ షోలో అద్భుతంగా రాణించాడు. 15 ప్రశ్నలకు ఎటువంటి తడబాటు లేకుండా సమాధానం చెప్పి.. కోటి రూపాయలను గెలుచుకున్నాడు. దీంతో కేబీసీ సీజన్ 13లో కోటి రూపాయలు గెలుచుకున్న రెండవ వ్యక్తిగా సాహిల్ ఆదిత్య అహిర్‌వాలా గుర్తింపు పొందాడు. అయితే 16వ ప్రశ్నకు సాహిల్ ఆదిత్య అహిర్‌వాల్ ఆన్సర్ చేసుకుంటే రూ.7 కోట్లను గెలుచుకునేవాడు. గురువారం ప్రసారం అయిన షోలో సాహిల్ ఆదిత్య అహిర్‌వాల్ ఎదుర్కొన్న రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే..

ప్రశ్న: Which is the only bird with a digestive system that ferments vegetation as a bovine does, which enables it to eat leaves and buds exclusively?

సమాధానం:  Hoatzin


కాగా.. కేబీసీలో కోటి రూపాయలను గెలుచుకోవడంపట్ల సాహిల్ ఆదిత్య అహిర్‌వాల్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను గెలిచిన ఈ డబ్బును కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా కోటి రూపాయలు గెలిచినప్పటికీ సివిల్స్ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తానని వెల్లడించాడు. ఐఏఎస్ జాబ్‌ను సాధించి తీరుతానని సాహిల్ ఆదిత్య అహిర్‌వాల్ ధీమా వ్యక్తం చేశాడు.ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement