కరణ్‌జోహార్‌ సినిమా నుంచి యంగ్ హీరో ఔట్.. కాంట్రవర్సీపై కార్తీక్ ఆర్యన్ ఏమన్నాడంటే..

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా పాపులారిటీ సాధించిన హీరోల్లో ఒకరు కార్తీక్ ఆర్యన్. ‘ప్యార్ కా పంచనామా’తో ఇండస్ట్రీకి పరిచయమై.. ‘సోనికే టీటూకీ స్వీటీ‌’తో స్టార్‌డమ్‌ అందుకున్న వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు.


తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ధమాకా’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్‌తో కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఈ డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్‌లో ‘దోస్తానా 2’కి హీరోగా ఎంపికయ్యాడు కార్తీక్. అయితే ఏవో కారణాల వల్ల అనంతరం ఆ మూవీ నుంచి బయటికి వచ్చాడు.


ఈ విషయంపై ఓ కార్యక్రమంలో కార్తీక్‌ని మీడియా అడగగా.. ‘నేను ఏ బాలీవుడ్ క్యాంపులో లేను. ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా టాలెంట్. ఇప్పటి వరకు అలాగే ఉన్నాను. ఇకపై అలాగే ఉంటాను. కరణ్ జోహార్‌తో కాంట్రవర్సీపై మాట్లాడన‌’ని తెలిపాడు.

Advertisement

Bollywoodమరిన్ని...