Jun 19 2021 @ 08:20AM

కార్తికేయ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది..

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ ఆదివారం ( జూన్ 20 ) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విడుదల చేయనున్నారు. వి. వి. వినాయక్ అసోసియేట్ శ్రీసరిపల్లి ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్తికేయ ఇందులో ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. క్లాసికల్ డాన్సర్ అయిన ఈమె ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి, అధర్వ మురళీ సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. 'మెంటల్ మదిలో', 'దొరసాని' చిత్రాలకు సంగీతం అందించిన ప్రశాంత్ ఆర్ విహారి దీనికి సంగీతం అందిస్తుండగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కార్తికేయ గత చిత్రం 'చావు కబురు చల్లగా' నిరాశపరచింది. మరి ఈ సినిమాతో హిట్ దక్కుతుందా లేదా చూడాలి.