Abn logo
Aug 2 2021 @ 00:03AM

మళ్లీ సార్వా నారుమడులు

తుందుర్రులో విత్తనాలు చల్లుతున్న రైతు

భీమవరం రూరల్‌, ఆగస్టు 1 : సార్వా నారుమడులు మరోసారి రైతులు ముమ్మరంగా వేస్తున్నారు. ఈ పంటకు నెల రోజుల కిందట నారుమడులు వేయడం, వర్షపునీటికి పూర్తిగా దెబ్బతినడంతో మళ్లీ నారుమడులు వేయాల్సి వచ్చింది. దీంతో మూడు రోజులుగా మండలంలో బేతపూడి, పెదగరువు, తుం దుర్రు, కరుకువాడ, యనమదుర్రు తదితర ప్రాంతాల్లో నారుమడులు వేస్తున్నారు. సార్వాలో రెండు పర్యాయాలు నారుమడులు వేయాల్సి రావడం సాగు ఆదిలోనే ఎకరానికి రూ.1500 వరకు పెట్టుబడి పెరగడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ప్రస్తుతం వేస్తున్న నారుమడులు వాతావరణం ఎంత వరకు రక్షిస్తుందో అన్న ఆలోచన రైతుల్లో నెలకొంది.