Abn logo
Jan 20 2021 @ 22:46PM

కారోబార్‌ ఆత్మహత్య

జీతం రాకపోవడంతో మనస్తాపం

రేగొండ, జనవరి 20: అప్పుల బాధతో కారోబార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మం డలంలోని ఆర్జీ తండాలో ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బదావత్‌ చందూలాల్‌(33) రెండేళ్లుగా స్థానిక పంచాయతీలో కారోబార్‌గా పనిచేస్తున్నాడు. ఐదు నెలలుగా జీతం రాకపోవడంతో అధిక వడ్డీకి అప్పులు తెచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వమని తరచూ ఇబ్బందులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు  తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శారద, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
Advertisement