Oct 12 2021 @ 21:54PM

కరీనా చెబుతోన్న ‘పూ’ ముచ్చట!

కరణ్ జోహర్ దర్శకత్వంలో షారుఖ్, కాజోల్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కభీ ఖుషీ కభీ గమ్‘. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, హృతిక్ రోషన్ కూడా ఈ మల్టీ స్టారర్‌లో కనిపించారు. అయితే, ఇరవై ఏళ్ల కింద విడుదలైన ‘కభీ ఖుషీ...’ చిత్రానికి అసలైన గ్లామర్ కరీనా కపూర్. హృతిక్‌కు జంటగా నటించిన ఆమె అల్ట్రా పోష్‌గా కనిపిస్తుంది సినిమాలో. తన పేరు పూజా అయితే ‘పూ’ అని స్టైలిష్‌గా చెప్పుకుంటూ ఉంటుంది!

రానున్న డిసెంబర్‌లో 20 ఏళ్ల మైలురాయి దాటనున్న ‘కభీ ఖుషీ..’ గురించి మాట్లాడుతూ బెబో తన పాత్ర గురించి కూడా స్పందించింది. ‘పూ’ రెండు దశాబ్దాల తరువాత కూడా ప్రతీ అమ్మాయి గుర్తు పెట్టుకునే క్యారెక్టర్ అంటోంది కరీనా. ‘పూ‘ ఒక టిపికల్ బాలీవుడ్ హీరోయిన్ కాదని వ్యాఖ్యానించిన మిసెస్ సైఫ్ అలీఖాన్, ఆ రోల్ చేసేందుకు ఎంతో కష్టపడ్డానని పేర్కొంది. ‘పూ’ అనాటి కాలానికి చాలా బోల్డ్ అని కూడా ఆమె చెప్పింది...


Bollywoodమరిన్ని...