Abn logo
Aug 5 2020 @ 19:09PM

వారందరూ బయటి నుంచి వచ్చిన వారే: కరీనా

బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చపై స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించింది. స్టార్‌లను తయారు చేసేది ప్రేక్షకులే తప్ప వారసత్వం కాదని స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు వాస్తవాలను అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తుంటారని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరీనా.. బంధుప్రీతి గురించి మాట్లాడింది. 


`మమ్మల్ని స్టార్‌లను చేసింది ప్రేక్షకులే. ఇంకెవరూ కాదు. 21 సంవత్సరాల నా కెరీర్‌కు స్టార్ వారసత్వం మాత్రమే కారణం కాదు. షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావు వంటి ఎందరో స్టార్లు బయటి నుంచి వచ్చిన వారే. వారి కష్టపడేతత్వమే వారిని స్టార్లను చేసింది. అలియా భట్ అయినా, కరీనా కపూర్ అయినా.. ఇంకెవరైనా కష్టపడి పనిచేస్తేనే ప్రజల ఆమోదం లభిస్తుంది. మేం సరిగ్గా నటించకపోతే వారే వద్దంటారు. చాలా మంది స్టార్ వారసులు ప్రేక్షకుల ఆమోదం పొందలేకపోయార`ని కరీనా పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement