Oct 16 2021 @ 14:48PM

ప్రభాస్ కు విలన్ గా కరీనా కపూర్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె’ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆయన కొత్త సినిమా ‘స్పిరిట్’ ఇటీవల అనౌన్స్‌మెంట్ జరుపుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. 2023 లో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త అభిమానుల్ని ఉర్రూతలూపుతోంది. అదేంటంటే.. ఇందులో ప్రభాస్ కు విలన్‌గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ..  ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కథను మలుపుతిప్పే కీలకమైన పాత్ర కరీనాకపూర్‌దేనట. ఆ పాత్రను చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారట దర్శకుడు. ‘స్పిరిట్’ ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తవగానే.. ఈ సినిమా స్టోరీ, ఆమె పాత్ర కరీనాకి నేరేట్ చేస్తారట దర్శకుడు సందీప్ రెడ్డి. అన్నీ అనుకున్నట్టే జరిగితే.. ఈ సినిమాలో కరీనా కపూర్ విలన్ గా ఫైనల్ అవుతుందని టాక్. దీని కోసం ఆమెకు భారీ పారితోషికం ఇవ్వడానికి రెడీగా ఉన్నారట మేకర్స్. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందనున్న ‘స్పిరిట్’ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని సమాచారం. మరి ఈ సినిమాలో నిజంగానే కరీనా కపూర్ విలన్ గా నటిస్తోందో లేదో తెలియాలంటే.. మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.