Sep 28 2021 @ 14:19PM

`హీరోయిన్` కరీనా బట్టల ఖర్చు కంటే ఆ సినిమా బడ్జెట్ తక్కువే అంటున్న నిర్మాత!

టబు ప్రధాన పాత్రలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ రూపొందించిన బ్లాక్ బస్టర్ చిత్రం `చాందినీ బార్`. బార్ డ్యాన్సర్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2001లో విడుదలై కల్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాతోనే జాతీయ ఉత్తమ నటిగా టబు అవార్డు అందుకుంది. ఈ సినిమా విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మధుర్ అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. 


కేవలం 1.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో `చాందినీ బార్` సినిమాను రూపొందించామన్నారు. `ఆ సినిమా కథ, టైటిల్ విని చాలా మంది విమర్శించారు. అదో బి-గ్రేడ్ సినిమా అనుకున్నారు. ఆ సినిమాను నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో కేవలం 1.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. నేను ఇటీవల తీసిన `హీరోయిన్` సినిమాలో కరీనా ధరించిన దుస్తుల ధరతో పోల్చుకుంటే ఈ సినిమా బడ్జెట్‌ చాలా తక్కువ`ని చెప్పారు. టబును ఊహించుకునే ఆ కథను తయారు చేసుకున్నామని, కథ విన్న వెంటనే ఆమె అంగీకరించిందని తెలిపారు. 

Bollywoodమరిన్ని...