Abn logo
Jul 15 2020 @ 09:06AM

కరోనా భయంతో ముంబైను వీడిన ప్రముఖ సినీనటుడు

తల్లిదండ్రులతో లోనావాలాకు...

ముంబై : ప్రముఖ నటుడు కరణ్ టాకర్ కరోనా భయంతో ముంబై నగరాన్ని వీడిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబై నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రముఖ సినీనటుడు, మోడల్, టీవీ వ్యాఖ్యాత కరణ్ టాకర్ తన తల్లిదండ్రులతో కలిసి ముంబై నగరం నుంచి తాత్కాలికంగా లోనావాలాకు తన మకాం మార్చారు. ‘‘నా కుటుంబం అంబీవ్యాలీలో ఉండేది..ముంబై నగరంలో కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉంది, నేను నివాసముంటున్న భవనంలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి చెందుతున్నందున వృద్ధులైన నా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి నిరంతరం నేను ఆందోళన చెందుతున్నాను’’ అని చెప్పారు కరణ్. అదృష్టవశాత్తూ మా కుటుంబంలో ఎవరికీ ఏమీ కాలేదని, కరోనా కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తాను కుటుంబంతో సహా నగరాన్ని వీడి సురక్షితంగా ఉండాలని ఈ ఆలోచన చేశానని కరణ్ వివరించారు.కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టాక తాను తిరిగి ముంబై నగరానికి వస్తానని కరణ్ చెప్పారు. తాను షూటింగు తర్వాత క్వారంటైన్‌లో ఉంటానని, అయితే తన తల్లిదండ్రులను ప్రమాదంలో పడేసే ఉద్ధేశం లేనందున తాను ముంబై నగరాన్ని వీడానని చెప్పారు. కరణ్ ‘స్పెషల్ ఆప్స్’ అనే వెబ్ షోలో కనిపించారు. 

Advertisement
Advertisement
Advertisement