Abn logo
Apr 6 2020 @ 18:42PM

కాణిపాకం గణేష్ ఆలయంపై దుష్ర్పచారం చేస్తే కఠిన చర్యలు: ఈవో

చిత్తూరు: కాణిపాకం గణేష్ సదన్‌ సత్రంలోనే కరోనా క్వారంటైన్‌ ఏర్పాటు చేశారు. అయితే కాణిపాకం వినాయక ఆలయాన్ని క్వారంటైన్‌ చేశారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. దీంతో ఈవో స్పందించారు. కాణిపాకం వినాయక ఆలయంపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 


మరోవైపు తమ గ్రామంలో క్వారంటైన్‌ ఏర్పాటుపై ప్రజల అభ్యంతరంతో కాణిపాకం గణేష్ సదన్‌ను అధికారులు ఆదివారమే ఖాళీ చేయించారు. అయినా కాణిపాకం ఆలయంపై తప్పుడు ప్రచారం జరిగింది. దీంతో జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. కాణిపాకం ఆలయంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. టీటీడీ సత్రాల్లో క్వారంటైన్ ఏర్పాటు చేయటంపై తమకు అభ్యంతరం లేదని ఈ సందర్భంగా తిరుపతి బీజేపీ నేతలు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement