Abn logo
May 4 2021 @ 15:16PM

Twitterకు Kangana Ranaut ఘాటు సమాధానం

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి కంగన రనౌత్ మంగళవారం ట్విటర్‌ విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. బ్రౌన్ పీపుల్‌ను బానిసలుగా చూడటం అమెరికన్లకు పుట్టుకతోనే అలవాటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించడంతో కంగన ఈ విధంగా స్పందించారు. 


పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హింసాకాండ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో బీజేపీ కార్యకర్తలను హత్య చేసినట్లు, ఆ పార్టీకి చెందినవారికి సంబంధించిన ఆస్తుల విధ్వంసం, దోపిడీలు, దహనాలకు పాల్పడినట్లు ఆ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్, పొలిటీషియన్ స్వపన్ దాస్‌గుప్తా చేసిన ట్వీట్‌కు కంగన రనౌత్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2000వ సహస్రాబ్దం ప్రారంభంలో ప్రదర్శించిన విరాట్ స్వరూపంతో మమత బెనర్జీని లొంగదీయాలని కంగన ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. బహుశా ఈ ట్వీట్ ఆమె ట్విటర్ అకౌంట్‌ను పర్మినెంట్‌గా సస్పెండ్ చేయడానికి దారి తీసి ఉండవచ్చునని తెలుస్తోంది. 


తన అకౌంట్‌ను సస్పెండ్ చేయడంపై కంగన స్పందిస్తూ, తన వాదనను ట్విటర్ రుజువు చేసిందన్నారు. ట్విటర్ యాజమాన్యం అమెరికన్లని, బ్రౌన్ పీపుల్‌ను బానిసలుగా చేసుకునే హక్కు తమకు ఉందని శ్వేత జాతీయులు పుట్టుక నుంచి భావిస్తారని అన్నారు. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఏం ఆలోచించాలోమనకి చెప్పాలని వాళ్ళు అనుకుంటారన్నారు. అదృష్టవశాత్తూ మాట్లాడటానికి తనకు అనేక వేదికలు ఉన్నాయన్నారు. వాటి ద్వారా తాను తన గళాన్ని వినిపిస్తానని చెప్పారు. సినిమా రూపంలో తన భావాలను వ్యక్తం చేయగలనని తెలిపారు. అయితే వేలాది సంవత్సరాలుగా హింస, బానిసత్వం, సెన్సార్‌షిప్‌కు గురవుతున్న మన దేశ ప్రజల కోసం తన హృదయం తల్లడిల్లుతోందని చెప్పారు. దేశ ప్రజల బాధలకు అంతం కనిపించడం లేదని వాపోయారు. 


Advertisement
Advertisement
Advertisement