Abn logo
Sep 19 2020 @ 23:40PM

అప్పుడు ప్రపంచంలో మొదటి స్థానానికి చేరుతాం - కంగనా రనౌత్‌

Kaakateeya

‘‘భారతదేశంలో హిందీ చిత్ర పరిశ్రమ అగ్రస్థానంలో ఉందని ప్రజలు అనుకుంటారు. కానీ అది తప్పు. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అగ్రస్థాయికి చేరుకుంది. చిన్న స్థాయి సినిమాల నుండి వివిధ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాలు తీసి ప్రేక్షకులకు వినోదం అందిస్తుంది. ఎన్నో హిందీ సినిమాల షూటింగులు రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్నాయి’’ అని కంగనా రనౌత్‌ అన్నారు. దేశంలోనే అందమైన ఫిల్మ్‌సిటీని ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్మిస్తామని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించిన నేపథ్యంలో కంగనా రనౌత్‌ స్పందించారు. ‘‘యోగి ఆదిత్యనాథ్‌ జీ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నా. వివిధ భాషా సినిమా పరిశ్రమల్ని కలిపితే మరింత ప్రయోజనం చేకూరుతుంది’’ అంటూ కంగనా పీఎంఓ ఇండియాకు ట్యాగ్‌ చేశారు.


‘‘సినిమా పరిశ్రమలో ఇలాంటి మార్పులు చాలా రావాలి. ‘భారతదేశ చిత్ర పరిశ్రమ’.. అనే ఓ పెద్ద పరిశ్రమ మనకు కావాలి. అనేక ఫిల్మ్‌ సిటీలు ఏర్పడాలి. దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే సామర్థ్యం సినిమా మాధ్యమానికి ఉంది. అందుకే.. వ్యక్తిగత గుర్తింపు ఉండి, సామూహిక గుర్తింపు లేని అనేక చిత్ర పరిశ్రమలను అఖండ భారతదేశంలా ఒక్కటి చేద్దాం. అప్పుడు మనం ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుతాం’’  అని కంగనా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement