Abn logo
Oct 19 2021 @ 00:52AM

ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కంచర్ల శ్రీకాంత్‌

కంచర్ల శ్రీకాంత్‌

 కందుకూరు, అక్టోబరు 18: ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కంచర్ల శ్రీకాంత్‌ చౌదరిని నియమించారు. సోమవారం విడుదల చేసిన రాష్ట్ర కమిటీలో ఈ మేరకు శ్రీకాంత్‌కి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి తాను చేసిన సేవలు, పార్టీ అభివృద్ధే లక్ష్యంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల స్థాయి టీడీపీ శిక్షణ  తరగతుల నిర్వహణ ద్వారా చేసిన సేవకు గుర్తింపుగా ఈ పదవి దక్కినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావటానికి కారకులైన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.