Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతిలో చట్ట, న్యాయ ఉల్లంఘన: కనకమేడల

నెల్లూరు: అమరావతిలో చట్ట, న్యాయ ఉల్లంఘన జరిగిందని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండున్నరేళ్ల క్రితం 3 రాజధానులని చెప్పారు.. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు. ఏపీలో ఏం అభివృద్ది చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించి ఉంటే.. భూముల విలువ లక్షల కోట్లలో ఉండేదని కనకమేడల రవీంద్ర తెలిపారు. 


మరోవైపు మూడు రాజధానుల చట్టాల విషయంలో ‘తగ్గేదే లేదు’ అని ఇన్నాళ్లుగా అంటున్న ఏపీ సర్కారు... ఉన్నట్టుండి వెనక్కి తగ్గింది. అమరావతిని కాదని అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో తీసుకొచ్చిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల్లో సాంకేతిక లోపాలున్నాయని ఇప్పుడు గుర్తించి.. వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు సోమవారం ప్రకటించింది. సంబంధిత వర్గాలతో చర్చించి... మరింత పకడ్బందీ బిల్లులతో మళ్లీ ముందుకు వస్తామని తెలిపింది.

Advertisement
Advertisement