Abn logo
Mar 25 2020 @ 20:21PM

క‌రోనా వైర‌స్‌పై పోరాటం.. క‌మ‌ల్ మరో అడుగు

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ప్ర‌పంచం గ‌జ‌గ‌జ‌లాడుతోంది. మ‌న దేశంలో ఇప్పుడిప్పుడే క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంది. అయితే దీని నివార‌ణ‌కు ప్రారంభ ద‌శ‌లో కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్రాతిప‌ద‌క‌న చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచ‌న‌లు చేస్తూ ప్ర‌భుత్వాలు లాక్ డౌన్‌ను ప్ర‌క‌టించాయి. డాక్ట‌ర్స్‌, ఇత‌ర వైద్య సిబ్బంది, స‌హాయ‌క సిబ్బంది రాత్రింబ‌గ‌ళ్లు ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి మ‌రింత వైద్య స‌దుపాయాలు, స్థ‌లం అవ‌స‌ర‌మ‌వుతున్నాయి.


ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడులో క‌రోనా బాధితుల స‌హాయార్థం ప్ర‌భుత్వానికి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా ఇచ్చారు న‌టుడు, పొలిటీషియ‌న్ క‌మ‌ల్‌హాస‌న్‌. ప్రస్తుత పరిస్థిని అర్థం చేసుకున్న ఆయన మరో అడుగు ముందుకేసి తేనాంపేట్‌లోని త‌న ఇంటిని త‌మిళ‌నాడు ప్రభుత్వం అంగీక‌రిస్తే హాస్పిట‌ల్‌గా మార్చి వైద్య సేవ‌లు అందించ‌డానికి అణువైన ప్ర‌దేశంగా చేస్తాన‌ని అన్నారు. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement