Jul 30 2021 @ 21:38PM

కమల్ హాసన్ సమక్షంలో ఒక్కటైన సినీ జంట

కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన గేయ రచయిత, మక్కల్‌ నీది మయ్యం యువజన విభాగ కార్యదర్శిగా ఉన్న స్నేహన్‌ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తూ వచ్చిన నటి కన్నికను వివాహం చేసుకున్నాడు. విశ్వనటుడు, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌, సినీ దర్శక దిగ్గజం భారతీరాజా వంటి సినీ ప్రముఖుల సమక్షంలో వధువు మెడలో ఉదయం 10.45 గంటల సమయంలో వరుడు మాంగల్యధారణ చేశాడు. గురువారం ఉదయం స్థానిక వడపళనిలోని గ్రీన్‌ పార్క్‌ నక్షత్ర హోటల్‌లో ఈ వివాహం కరోనా మార్గదర్శకాలకు లోబడి జరిగింది. ఈ వివాహాన్ని కమల్‌హాసన్‌, భారతీరాజాలు ముందుండి జరిపించారు. ముఖ్యంగా మంగళసూత్రాన్ని కమల్‌ హాసన్‌ తీసి వరుడికి అందజేయగా, ఆయన వధువు మెడలో మూడుముళ్ళు వేశారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులతో పాటు ఎంఎన్‌ఎంకు చెందిన కీలక నేతలు, అతి కొద్దిమంది సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. 

Otherwoodsమరిన్ని...