Abn logo
Oct 22 2021 @ 20:14PM

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు: ఉత్తమ్‌

కరీంనగర్: సీఎం కేసీఆర్‌ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని, అందులో 8శాతం కమిషన్‌ దండుకున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏడున్నర ఏళ్లుగా మంత్రిగా ఏమీ చేయలేని ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏమి సాధిస్తాడని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రాజెక్టుల్లో కమీషన్లు దండుకుంటే, ఈటల దళితులు, దేవాలయ భూములు ఆక్రమించాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనామకుడు నియోజకవర్గంలోనే అందరికీ తెలియనివాడని తెలిపారు. యువకుడు, విద్యావంతుడు వెంకట్‌ను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా అసెంబ్లీలో మీ తరుఫున కొట్లాడుతాడని పేర్కొన్నారు. బీజేపీ మనువాద పార్టీలో చేరిన ఈటలకు ఆత్మగౌరవం ఎక్కడుందని త్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...