Oct 22 2021 @ 20:08PM

Ajay Devgn సీక్రెట్స్‌ను అభిమానులకు తెలిపిన Kajol

ప్రతి ఒక్కరికీ సీక్రెట్స్ అనేవి తప్పక ఉంటాయి. బాలీవుడ్ సెలెబ్రిటీలైనా సరే అందుకు మినహాయింపు ఏమీ కాదు. బాలీవుడ్ స్టార్ హీరో భార్య అతడి సీక్రెట్స్‌ను అభిమానులతో పంచుకుంది. తన భర్తకు ఒక ఓసీడీ ఉందని ఆమె చెబుతోంది.


బేర్ గ్రిల్స్ హోస్ట్‌గా వ్యవహరించే ‘‘ ఇన్ టు ద వైల్డ్ ’’ షోలో అజయ్ దేవగణ్ పాల్గొన్నారు. ఈ షోలో కాజోల్ అతిథి పాత్రలో కనిపించి అజయ్ దేవగణ్ గురించి మనకు తెలియని అనేక సీక్రెట్స్‌ను అభిమానులకు చెప్పింది. ‘‘నా భర్త మంచి కుక్. ఆయనకు బోర్డర్ లైన్ ఓసీడీ ఉంది. తన చేతి వేళ్లతో వంటకు సంబంధించిన పదార్థాలను ఆయన తాకరు. ఎందుకంటే ఆ చేతి వేళ్ల నుంచి వాసన వెళ్లదని ఆయన అభిప్రాయం. ఆయన ఈ ఓసీడీ నుంచి బయటపడలేడని నేను సవాల్ చేస్తున్నాను ’’ అని కాజోల్ చెప్పింది.


అజయ్ దేవగణ్ నటించిన సింగం సినిమాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి మాట్లడుతూ..‘‘ ఇది బాగాలేదు బాస్. మీరు నాతో యాక్షన్ సీన్స్ చేయకుండా బేర్ గ్రిల్స్ దగ్గరకు ఎందుకు వెళ్లారు. గత కొన్ని ఏళ్లుగా మీరు చేస్తున్న స్టంట్స్‌ను అనేక మంది వీక్షించారు. స్పెషల్ ఎఫెక్ట్స్ అందుబాటులో లేని కాలంలో కూడా మీరు స్టంట్స్ చేశారు. ప్రస్తుతం మీరు నా ఛాలెంజ్‌ను స్వీకరించండి. మీరు, బేర్ కలిసి ఒక దానిని రూపొందించి  ఈ ద్వీపం నుంచి బయటపడండి ’’ అని చెప్పారు.


ఈ ఎపిసోడ్ డిస్కవరీ ఫ్లస్‌లో ప్రసారం కానుంది. గతంలో అక్షయ్ కుమార్, రజనీకాంత్ బేర్ గ్రిల్స్ షోలో కనిపించారు. అజయ్ దేవగణ్ అనంతరం విక్కీ కౌశల్ ఈ షోకు వచ్చే అవకాశం ఉంది.

Bollywoodమరిన్ని...