Oct 13 2021 @ 08:03AM

దుర్గా పూజలో భావోద్వేగానికి లోనయిన కాజోల్

బాలీవుడ్ నటి కాజోల్ తన కుటుంబ సభ్యులను చూసి ఎమోషనల్ అయ్యారు. కరోనా వేవ్స్ కారణంగా గత ఏడాది నుంచి అందరూ తమ బంధుమిత్రులకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరినీ ఎవరు కలవడం లేదు. ఒకవేళ చూసుకోవాలనుకున్నా.. ఏదైనా సెలబ్రేషన్స్ అయినా వీడియో కాల్స్ ద్వారా తప్పితే ప్రత్యక్షంగా చూసుకునే వీలు లేకపోయింది. అయితే ప్రస్తుతం విజయదశమి పండుగ సందర్భంగా అందరూ అమ్మవారి నవరాత్రి పూజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ కపుల్ అజయ్ దేవగణ్, కాజోల్ కూడా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. నవరాత్రి అమ్మవారి పూజలలో భాగంగా తన కుటుంబ సభ్యులను కలిసిన కాజోల్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం కాజోల్ తన కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Bollywoodమరిన్ని...