Abn logo
Oct 24 2020 @ 13:56PM

కాజల్ `లైవ్ టెలీకాస్ట్` టీజర్!

Kaakateeya

ఇన్ని రోజులూ వెండితెరపై సత్తా చాటిన చందమామ కాజల్ అగర్వాల్ అతి త్వరలో డిజిటల్ వేదిక మీద కూడా సందడి చేయబోతోంది. కెరీర్‌లో మొదటిసారి ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇప్పటికే విడుదలైన `లైవ్ టెలికాస్ట్` ఫస్ట్ లుక్‌లో కాజల్ రూపం చూసి అభిమానులు షాకవుతున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ కూడా విడుదలైంది. 


హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో కాజల్ గతంలో ఎప్పుడూ చేయని పాత్రలో కనిపించింది. టీజర్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ అతి త్వరలో డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో కాజల్‌తో పాటు వైభవ్, ఆనంది ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 


Advertisement
Advertisement