Abn logo
Mar 27 2020 @ 15:51PM

సీక్వెల్‌లోనూ కాజల్‌కే ఛాన్స్?

దాదాపు దశాబ్దానికిపైగా టాప్ హీరోయిన్‌గా కొనసాగిన చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్రహీరోలందరితోనూ నటించింది. కొత్త భామల రాకతో కాజల్‌ జోరు తగ్గినప్పటికీ అవకాశాలు మాత్రం ఆమెకు బాగానే వస్తున్నాయి. సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు కాజల్ దక్కించుకుంటోంది. 


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన `ఆచార్య`లో నటించే అవకాశాన్ని కాజల్ దక్కించుకుంది. తాజాగా మరో మంచి అవకాశం కాజల్‌కు వచ్చినట్టు సమాచారం. తమిళ అగ్రహీరో విజయ్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో గతంలో తెరకెక్కిన `తుపాకి` చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోందట. ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా కాజల్‌నే రిపీట్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు పనులు జరుగుతున్నాయ. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోందట. 

Advertisement
Advertisement
Advertisement