Abn logo
May 30 2020 @ 13:22PM

స్పెష‌ల్ కేకుల త‌యారీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటి నుండి బ‌య‌ట‌కు రాలేదు. సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తూనే ఉంది. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లో ఉంటున్న తార‌లంద‌రూ కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డ‌మో, ఇంటి ప‌ని చేయ‌డం, వంట‌ప‌ని చేయ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. వీరి బాట‌లోనే కాజ‌ల్ వంట నేర్చుకోవడంలో ఫుల్ బిజీగా మారింది. స‌మోసాలు, తెలుగువారి వంటకాల‌ను నేర్చుకున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ తాజాగా కేక్స్‌ను త‌యారు చేయ‌డం నేర్చుకుని, కేక్స్ త‌యారు చేసింది. చాకొలేట్ కేక్‌తో పాటు క్యారెట్ కేక్‌ను త‌యారు చేసిన‌ట్లు కాజ‌ల్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. 

Advertisement
Advertisement
Advertisement