Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మహిళల ఛీత్కారాలు

టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ 

పెడన, డిసెంబరు 2 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను మహిళలు చీదరించుకుంటున్నారని టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం మహిళల ఆత్మగౌరవసభ నిర్వహించారు. కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈనెల 5న మండల స్థాయిలోనూ, 6న గ్రామ స్థాయిలోనూ ఆత్మగౌరవ సభలు నిర్వహించి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. దాసరి కరుణ జ్యోతి, బర్రి సుశీల, పడమట నాగమల్లేశ్వరి, రహీమున్నీసా, పోతన స్వామి, వడుగు తులసీరావు, ఉమ్మిడిశెట్టి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

  తెలుగు మహిళల నిరసన

 పెదపారుపూడి : వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలను కించపరిచే విధంగా  వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తూ పెదపారుపూడిలో తెలుగు మహిళలు, టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు. మాజీ ఎంపీపీ కాజ విజయలక్ష్మి మాట్లాడుతూ, మహిళలు అంటే గౌరవం లేని వైఎస్సాఆర్‌ నేతలు రాజ్యాంగ పదవుల్లో కొనసాగడానికి అర్హులు కారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. చలసాని రమేష్‌ చౌదరి, చక్రపాణి, మసిముక్కు రాంబాబు, కొల్లూరి అనూష, పేరేసు, చిలకా ఆంజనేయులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement