Abn logo
Oct 30 2020 @ 04:49AM

అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

Kaakateeya

 బ్లూకోల్ట్స్‌, రక్షక్‌, హైవే, దిశ, పెట్రోలింగ్‌ సిబ్బందికి..

 రేడియం జాకెట్లు, టార్చ్‌లైట్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లు పంపిణీ


కడప (క్రైం), అక్టోబరు 29 : జిల్లాలో బ్లూకోల్ట్స్‌, రక్షక్‌, హైవే, దిశ, పెట్రోలింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పేర్కొన్నారు. వీరికి గురువారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉన్న పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో రేడియం జాకెట్లు, టార్చ్‌లైట్లు, అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు రోప్‌ (తాడు), ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులను అందించారు. ప్రమాదాల బారినపడ్డ బాధితులకు, సమస్యల్లో ఉన్నవారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా వీటిని అందజేశామని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో హైవేలలో గస్తీ విధులు నిర్వర్తించే సమయంలో వాహనదారుల నుంచి ప్రమాదాల బారిన పడకుండా రేడియం జాకెట్లు రక్షణ కల్పిస్తాయన్నారు. జిల్లాలో ఉన్న బ్లూకోల్ట్స్‌, రక్షక్‌, హైవే, దిశ, పెట్రోలింగ్‌, ట్రాఫిక్‌ సిబ్బంది అందరికీ వీటిని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) దేవప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ రిషికేశవరెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, ఎస్సీ ఎస్టీ సెల్‌ డీఎస్పీ సుధాకర్‌, డీటీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్‌, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement