Abn logo
Jun 19 2021 @ 17:31PM

బద్వేల్ ప్రేమోన్మాది ఘటనపై ఎస్పీ అన్బురాజన్‌ వివరణ

కడప: బద్వేల్ ప్రేమోన్మాది ఘటనపై ఎస్పీ అన్బురాజన్‌ వివరణ ఇచ్చారు. ప్రేమోన్మాది చరణ్‌ సహా మరో ఇద్దరిపై బద్వేల్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నిందితుడు చరణ్ కోలుకుంటున్నాడు. చరణ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రేమను అంగీకరించలేదని డిగ్రీ విద్యార్థిని శిరీషను గొంతుకోసి నిందితుడు హతమార్చాడని చెప్పారు. కడప జిల్లాలో మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.