Abn logo
May 30 2020 @ 03:36AM

జనవరిలో వరల్డ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌

న్యూఢిల్లీ: కరోనా వైర్‌సతో వాయిదా పడిన వరల్డ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పను రీషెడ్యూల్‌ చేశారు. ఈ టోర్నీని న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో వచ్చే ఏడాది జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య శుక్రవారం ప్రకటించింది. ఇక వరల్డ్‌ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌ప జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు జరగనుంది.

Advertisement
Advertisement
Advertisement