Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతను అత్యంత ప్రమాదకారి.. ఈ సమాజంలో బతికే అర్హత లేదు.. ఆ వ్యక్తి చేసిన ఘోరంపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు!

`అతను అత్యంత ప్రమాదకారి. అతనికి ఈ సమాజంలో బతికే అర్హత లేదు` అంటూ అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష విధించారు. భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డమే కాకుండా ఆమెను హతమార్చిన కేసులో నిందితుడికి రాజస్థాన్‌లోని శ్రీగంగాపూర్ జిల్లా కోర్టు‌ న్యాయమూర్తి ఈ శిక్ష విధించారు. 


దుల్మానా అనే గ్రామంలో భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న 60 ఏళ్ల వృద్ధురాలిపై 19 ఏళ్ల సురేంద్ర అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేశాడు. పోలీసుల దర్యాఫ్తులో సురేంద్ర అసలు నిందితుడని తేలింది. దీంతో అతడిని కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి సోమవారం తుదితీర్పును వెలువరించారు. నిందితుడికి ఉరిశిక్ష విధించారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement