- ఇన్స్పెక్టర్ భూపాల్‌శ్రీధర్
కొత్తూర్: నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఇన్ముల్‌నర్వ శివారులోని హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా ఉత్సవాలకు 200మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం ఇన్స్పెక్టర్ భూపాల్‌శ్రీధర్ తెలిపారు. ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 22 మంది ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, పరుష, మహిళా కానిస్టేబుళ్లతో బందోబస్తు కొనసాగుతుందన్నారు. పోలీస్ శాఖ సూచించిన స్థలాల్లో మాత్రమే వాహన పార్కింగ్ చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి కేశంపేట వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ మళ్లించామన్నారు.
మంత్రుల రాక
జేపీ దర్గా ఉర్సులో పాల్గొనేందుకు మంత్రులు మహముద్‌అలీ, సబితాఇంద్రారెడ్డి రానున్నట్టు సమాచారం. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, ఎంపీ శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కూడా హాజరవుతున్నట్లు తెలిసింది.
దర్గాలో క్షీరాభిషేకం
బుధవారం దర్గా సమాధులకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఉర్సు నేపథ్యంలో వక్ఫ్‌బోర్డు ఒకరోజు ముందే దర్గా సమాధులకు క్షీరాభిషేకం నిర్వహించింది. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తనయుడు కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్ క్షీరాభిషేకంలో పాల్గొన్నారు. ఆయనతో టీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు యాదగిరి, ఎమ్మె సత్యనారయణ, లింగంనాయక్, మెండె కృష్ణ, దేవేందర్‌యాదవ్, శ్రీరాములుయాదవ్, యాదగిరి, రమేష్, గోపాల్ ఉన్నారు.