Advertisement
Advertisement
Abn logo
Advertisement

జొన్నవాడ, పెనుబల్లిలో మొహరించిన పోలీస్‌ బలగాలు

బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 2:  నేడు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మండలంలోని జొన్నవాడ, పెనుబల్లి గ్రామాలకు రానున్నారు. ఈ సందర్భంగా గురువారం జొన్నవాడ, పెనుబల్లి గ్రామాల్లో పోలీసు దళాలు మొహరించాయి. గత రెండు రోజులుగా కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, సీఎం సెక్యూరిటీ అధికారులు    సలహాలు, సూచనలతో సీఎం పర్యటించే మార్గాల్లో చేస్తున్న రోడ్ల మరమ్మతులు, ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జొన్నవాడ బ్రిడ్జి దగ్గర్నుంచి పెనుబల్లి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగేలా రోడ్ల విస్తరణ, బారికేడ్ల ఏర్పాటుతో బందోబస్తు ఏర్పాటు చేశారు.


Advertisement
Advertisement