Abn logo
Sep 22 2020 @ 01:09AM

ఉమ్మడి జిల్లా :699

Kaakateeya

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో సోమవారం 699 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌జిల్లాలో 424, రంగారెడ్డి జిల్లాలో 257, వికారాబాద్‌ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి.


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌లో 250 మందికి  కరోనా పరీక్షలు చేయగా 27మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 41మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 24 మందికి పరీక్షలు చేయగా ఒక్కరికీ పాజిటివ్‌ రాలేదు.  శంకర్‌పల్లి మండలంలో 79 మందికి  పరీక్షలు చేయగా 4, మొయినాబాద్‌ మండలంలో 58 మందికిగాను 9, షాబాద్‌ మండలంలో 57 మందికి  గాను 8మందికి పాజిటివ్‌గా తేలింది. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..

ఇబ్రహీంపట్నం / శంషాబాద్‌ / కందుకూరు / ఆమనగల్లు : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 396 మందికి కరోనా టెస్టులు చేయగా 39 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో 10, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 4, యాచారం పీహెచ్‌సీలో 4, దండుమైలారం పీహెచ్‌సీలో 1, ఎలిమినేడు పీహెచ్‌సీలో 4, మంచాల పీహెచ్‌సీలో 2, మాడ్గుల పీహెచ్‌సీలో 3, సీహెచ్‌సీ హయత్‌నగర్‌లో 3, తట్టిఅన్నారంలో 5, రాగన్నగూడలో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది.


ఇబ్రహీంపట్నం టౌన్‌ మంచాల రోడ్డులో మిల్క్‌ సెంటరు నిర్వాహకుడు (35), అతడి తండ్రి (80)కి కరోనా పాజిటివ్‌రాగా నాలుగు రోజుల క్రితం ఇరువురిని గచ్చిబౌలి టిమ్స్‌లో చేర్చారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కుమారుడు మృతి చెందాడు. శంషాబాద్‌ మున్సిపాలిటీలో 77 మందికి పరీక్షలు చేయగా 10పాజిటివ్‌ కేసులు వచ్చాయి. కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సోమవారం 52 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజి టివ్‌ వచ్చింది. ఆమనగల్లు, కడ్తాల, వెల్దండ, మాడ్గుల, నాగర్‌కర్నూల్‌ మండలాల పరిధిలో 59మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో సోమవారం 331 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 35 మందికి పాజి టివ్‌ వచ్చింది. ఇందులో షాద్‌నగర్‌లో 5, ఫరూఖ్‌నగర్‌ మండలంలో 10, కొత్తూర్‌ మండలంలో 10, నందిగామ మండలంలె 6 కేసులు వచ్చాయి. మిగతా నలుగురు ఇతర మండలాలకు చెందిన వారున్నారు. 


కుల్కచర్లలో..

కులకచర్ల: కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 18 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజి టివ్‌ వచ్చింది. పీరంపల్లిలో 1, ఘనాపూర్‌లో 1, చెల్లాపూర్‌లో 1 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో సోమవారం 24 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 38మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.     

Advertisement
Advertisement
Advertisement