Abn logo
Oct 23 2020 @ 04:44AM

ఉమ్మడి జిల్లా 424 కరోనా కేసులు

Kaakateeya

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 424 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 187 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. మేడ్చల్‌ జిల్లాలో 221, వికారాబాద్‌ జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడు జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 92,864కు చేరుకుంది. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..

ఇబ్రహీంపట్నం / శంషాబాద్‌ : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 11 కేంద్రాల్లో 224 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 26 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నం 2, యాచారం 9, ఆరుట్లలో 1, అబ్దుల్లాపూర్‌మెట్‌ 2, తట్టిఅన్నారం 4,  హయత్‌నగర్‌ 2, రాగన్నగూడలో ఆరుగురికి పాజిటివ్‌ అని తేలింది. శంషాబాద్‌ మున్సిపాలిటీలో 33 మందికి కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. 


చేవెళ్ల డివిజన్‌లో...

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 140 మందికి కరోనా పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 36 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, మొయినాబాద్‌ మండలంలో 25 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి, షాబాద్‌ మండలంలో  36 మందికి  పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 15 మందికి, శంకర్‌పల్లి మండలంలో 28 మందికి పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు.


షాద్‌నగర్‌ డివిజన్‌లో... 

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 173మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో షాద్‌నగర్‌కు చెందిన ముగ్గురు, కొత్తూర్‌ మండలానికి చెందిన ముగ్గురు, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన ఒకరు ఉన్నారు.


కులకచర్లలో..

కులకచర్ల: కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 13 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో కులకచర్లకు చెందిన ఒకరికి పాజిటివ్‌గా వచ్చింది. 


మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ / కీసర : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 60మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో ఐదుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. కీసరలో 31 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది.

Advertisement
Advertisement