Abn logo
Sep 26 2021 @ 00:00AM

ఉపాధి పనులను పరిశీలించిన జాయింట్‌ కమిషనర్‌

పనులను పరిశీలిస్తున్న జాయింట్‌ కమిషనర్‌ కల్యాణచక్రవర్తి

యల్లనూరు, సెప్టెంబరు 26: మండలంలో చేపట్టిన ఉపాధిహామీ పనులను ఆదివా రం రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ కల్యాణచక్రవర్తి పరిశీలించారు. చింతకాయమందలో చేపట్టిన అవెన్యూ, పార్క్‌ ఏర్పాటు, యల్లనూరు చెరువులో ఫారంఫాండ్‌, కేజీబీవీ పాఠశాలలో  వర్షం నీటిగుంతను పీడీ వేణుగోపాల్‌రెడ్డితో పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పండ్ల తోటల పెంపకంలో మెటీరియల్‌ కాం పౌండ్‌ ఆలస్యమైందని, త్వరలోనే అందిస్తామన్నారు. ఆయన వెంట ఏపీడీ లావణ్యకుమా రి, ఎంపీడీఓ ఓబులమ్మ, ఏపీఓలు ఈశ్వరయ్య, షబ్బీర్‌బాషా, సిబ్బంది ఉన్నారు.