Abn logo
Sep 30 2020 @ 02:48AM

బహిరంగ చర్చకు సిద్దమైన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్

Kaakateeya

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. రిపబ్లికన్ నేత, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. డెమొక్రటిక్ నేత జో బైడెన్ ట్రంప్‌కు గట్టి పోటీనే ఇస్తున్నారు. మరొకొద్ది గంటల్లో ఒకే వేదికపై ఈ ఇద్దరు నేతలు తలపడనున్నారు. ముఖాముఖి చర్చలో ట్రంప్, బైడెన్ పాల్గొనబోతున్నారు. మూడు ముఖాముఖిల్లో భాగంగా తొలి చర్చ భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30 గంటలకు జరగనుంది. ముఖాముఖిగా బహిరంగ చర్చలో ఇద్దరు నాయకులు పాల్గొని.. ప్రత్యర్థుల ప్రశ్నలను ఎదుర్కోబోతున్నారు.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, విదేశాంగ విధానంపై  ముఖ్యంగా ఇరువురూ తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ‘సూపర్‌ బౌల్‌ ఆఫ్‌ అమెరికన్‌ డెమోక్రసీ’ అని పిలిచే ఈ కీలక చర్చకు ఒహియోలోని క్లీవ్‌లాండ్‌ విశ్వవిద్యాలయం వేదిక కానుంది. అక్టోబరు 15న ఫ్లోరిడాలోని మియామిలో, అదే నెల 22న టెన్నెసీలోని నష్‌విల్లేలో రెండో, మూడో విడత ముఖాముఖి చర్చలు జరుగుతాయి. ఇక అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి.

Advertisement
Advertisement
Advertisement