Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికా నటికి ఇండియా తెగ నచ్చేసిందట!

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ నటికి ఇండియా తెగ నచ్చేసిందట. ఇండియాలో మరోసారి పర్యటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను సదరు నటి బయటపెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యానికి చెందిన ప్రఖ్యాత నటి జోడీ ఫోస్టర్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. భారత్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. 1980ల్లో భారత్‌ను సందర్శించినట్టు జోడీ ఫోస్టర్ వెల్లడించారు. నాటి పర్యటనను ‘గ్రేటెస్ట్ ట్రిప్’ అంటూ ఆమె అభివర్ణించారు. భారత పర్యటన గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ‘భారత్‌లో మరోసారి పర్యటించేందుకు ఇష్టపడతాను. దేశం చాలా మారిందని నాకు తెలుసు. ఆ మార్పులను కళ్లారా చూడాలనుకుంటున్నాను’ అంటూ జోడీ ఫోస్టర్ వ్యాక్యానించారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement