Abn logo
Jun 19 2021 @ 18:39PM

యోగితో భేటీ అయిన జితిన్ ప్రసాద

లక్నో : ముఖ్యమంత్రి యోగితో బీజేపీ యువనేత జితిన్ ప్రసాద భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో జితిన్ ప్రసాద పాత్రపై వీరిద్దరి మధ్యా చర్చకు వచ్చింది. అయితే మర్యాదపూర్వకంగానే జితిన్ ప్రసాద ముఖ్యమంత్రి యోగితో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలొస్తున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యమేర్పడింది. మోదీ సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి ఏకే శర్మకు కీలక బాధ్యతలు అప్పజెప్పినట్లుగానే, జితిన్ ప్రసాదకు కూడా కీలక బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరుగుతోంది.