Abn logo
Jul 31 2021 @ 01:01AM

సచివాలయ సేవలపై జేసీ అసంతృప్తి

బుక్కాపురం సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న జేసీ సిరి

పుట్లూరు, జూలై 30: మండలంలోని కడవకల్లు, మడ్డిపల్లి సచివాలయాలను శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ సిరి ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా సచివాలయ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉద్యోగులు పథకాలకు సంబంధించి రిజిస్టర్లు నిర్వహించాలని చెప్పి నా పట్టించుకోవడం లేదన్నారు. పథకాల అర్హుల జాబితా సచివాలయాల్లో ఎక్కడో ఒకచోట అతికించకుండా బయట ప్రదేశంలో చదివే విధంగా ఉం డాలన్నారు. ప్రజలకు సచివాలయ సేవలు అందుబాటులో ఉండాలని సూ చించారు. లబ్ధిదారుల జాబితాలో ఏమైనా అవకతవకలు జరిగితే సంబంధి త అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్కడున్న కొం తమంది ప్రజలు రేషనకార్డులు రాలేదని తెలపగా, వాటిపై త్వరలోనే వి చారణ జరిపి మంజూరు చేస్తామన్నారు. అనంతరం జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. జేసీ వెంట తహసీల్దార్‌ విజయకుమారి, ఇనచార్జ్‌ ఎంపీడీఓ ఆనంద్‌ప్రసాద్‌, సర్పంచు రామాంజనేయులు ఉన్నారు. 


యల్లనూరు: మండలంలోని బుక్కాపురం సచివాలయాన్ని శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ సిరి తనిఖీచేశారు. ఈ సందర్భంగా మూమెంట్‌ రిజిస్టర్‌తో పాటు రికార్డులను పరిశీలించారు. కొవిడ్‌ వ్యాక్సినపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన అందిస్తున్నామని సిబ్బంది చెప్పడంతో... మీకు ఎవరు చెప్పారంటూ జాయింట్‌ కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె వెంట ఎంపీడీఓ ఓబులమ్మ, ఈఓఆర్‌డీ విజయ్‌శంకర్‌నాయుడు, ఎంఈఓ చంద్రశేఖర్‌ ఉన్నారు. 


గుంతకల్లు టౌన: పట్టణంలోని 17, 29వ సచివాలయాలను జేసీ గం గాధర్‌ గౌడ్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం సచివాలయలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దన్నారు. అ నంతరం సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. జేసీ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ బండిశేషన్న, ఆర్వో నాసిర్‌ హుసేన ఉన్నారు.