Abn logo
Aug 3 2021 @ 23:19PM

గృహ నిర్మాణ కార్యాచరణ సిద్ధం చేయండి

నాగిరెడ్డిగూడెం వద్ద కాలనీలో పరిశీలిస్తున్న జేసీ సూరజ్‌ ధనుంజయ్‌

చింతలపూడి, ఆగస్టు 3: మండలంలో మంజూరైన 925 గృహ నిర్మాణాలకు కార్యాచరణ సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ (గృహ నిర్మాణ) అధికారులను ఆదేశించారు. నాగిరెడ్డిగూడెంలో 452 గృహ నిర్మాణాల కాలనీ లేఅవుట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అంత కుముందు చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. లబ్ధిదారులు గృహాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే మెటీరియల్‌తో పాటు గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకుల ద్వారా రుణాలు వచ్చే అవకాశం ఉందని, జాబితా తయారు చేయాలని, బ్యాంక్‌ అధికారులతో మాట్లాడాలని వెలుగు అధికారులకు సూచించారు. కొద్ది రోజుల్లో యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసి గ్రౌండింగ్‌ వెళ్లేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవా లని జేసీ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన లబ్ధిదారుల జాబితా లను ఆయన పరిశీలించారు. పాత చింతలపూడి సచివాలయాన్ని అక్కడ జగనన్న కాలనీల లేఅవుట్లను కూడా పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ ప్రమద్వొర, ఎంపీడీవో రాజ్‌మనోజ్‌, నగర పంచాయతీ కమి షనర్‌ వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ డీఈ రంగారావు, ఏఈ వివేకా నందరావు, వెలుగు ఏపీఎం జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.