Abn logo
Aug 7 2020 @ 03:07AM

బెయిలుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల

  • అస్మిత్‌రెడ్డి కూడా

కడప (క్రైం), అనంతపురం క్రైం/తాడిపత్రి  ఆగస్టు 6: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసుల్లో అనంతపురంలో అరెస్టై కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి గురువారం బెయిల్‌పై బయటకొచ్చారు. వీరిద్దరికీ బుధవారం అనంతపురం కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తాడిపత్రి నుంచి దాదాపు 200 వాహనాల్లో అనుచరులతో దివాకరరెడ్డి కుమారు డు పవన్‌కుమార్‌ రెడ్డి కడప కేంద్ర కారాగారం వద్దకు  చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. మరోవైపు.. అనంతపురం జిల్లా సరిహద్దులోని తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద ప్రభాకర్‌ రెడ్డి వాహనాలను రాత్రి 9.30 గంటల సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. కరోనా కారణంగా కొద్దివాహనాల్లో మాత్రమే వెళ్లాలని చెప్పడంతో పోలీసులతో ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. 

Advertisement
Advertisement
Advertisement