Abn logo
Jun 18 2021 @ 23:19PM

ముంపుపై ప్రణాళిక సిద్ధం చేయండి : జేసీ

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కేవీ రమణారెడ్డి

పోలవరం, జూన్‌ 18: ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అసౌకర్యం లేకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో రానున్న వరద ప్రవా హాన్ని అంచనా వేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో బోట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. ముంపు గ్రామాలకు కావలసిన నిత్యావసర సరుకులు, మందుల నిల్వలు సిద్ధంగా ఉంచాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ నరసింహమూర్తి, ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రవిబాబు, ఆర్‌డబ్య్లూఎస్‌ ఎస్‌ఈ రామస్వామి, ఆర్‌ అండ్‌బీ ఈఈ రాము, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ రాజు, ఐసీడీఎస్‌ పీడీ విజయకుమారి, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ సునంద, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్‌,  పాల్గొన్నారు.