Abn logo
Jun 4 2020 @ 04:58AM

స్థలం మీదా.. ఆధారాలు చూపండి ? : జేసీ నాగలక్ష్మి

మనుబోలు, జూన్‌ 3:  మీరు ప్రభుత్వ స్థలంలో ఉంటూ ఇవ్వనంటారా.. ? మీదనేదానికి ఆధారాలు ఉన్నాయా.. ఉంటూ చూపండి.. అంటూ చెర్లోపల్లిలో గ్రామస్థులను  జేసీ జీవీవీఎస్‌ నాగలక్ష్మి ప్రశ్నించారు. మండలంలో ఇళ్లస్థలాల భూ సేకరణపై తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. లేఅవుట్ల మ్యాప్‌ను పరిశీలించి సర్వేయర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెర్లోపల్లి, బండేపల్లి గ్రామాల్లో గుర్తించిన భూమిని క్షేత్ర పరిశీలన చేసి గ్రామస్థులతో మాట్లాడారు. 19 పంచాయతీల్లో 62ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటికీ 47ఎకరాలు మాత్ర మే గుర్తించారన్నారు. మిగతా భూమిని రెండురోజుల్లోగా గుర్తించి వారంలోగా లేఅవుట్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎస్‌ హరనాథ్‌, డీటీ అనిల్‌కుమార్‌, సర్వేయర్‌ రాము, ఆర్‌ఐ సుగుణమ్మ  పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement