Abn logo
Oct 20 2021 @ 23:07PM

కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతి వేడుకలు

జ్యోతిప్రజ్వలన చేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి

చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జేసీలు, అధికారులు

విశాఖపట్నం, అక్టోబరు 20: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం వాల్మీకి జయంతి  వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్లు ఎం. వేణుగోపాలరెడ్డి, పి.అరుణ బాబులు వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణం ఆది కావ్యంగా ప్రపంచానికి ఆదర్శనీయమైందని అన్నారు. వాల్మీకి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీవో పెంచలకిశోర్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.