Abn logo
Oct 30 2020 @ 10:04AM

అసలు మద్యం రేట్లు ఎందుకు పెంచారు? ఎందుకు తగ్గించారు?: జవహర్

Kaakateeya

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డికి కమీషన్లు తప్ప.. ప్రజల ఎమోషన్లు పట్టవా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. ఏ సీఎం అయినా ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటారు.. జగన్ మాత్రం కమీషన్లు, వైసీపీ నేతల సంపాదన కోసం నిర్ణయాలు తీసుకుంటారని ఎద్దేవా చేశారు. అసలు మద్యం రేట్లు ఎందుకు పెంచారు? ఎందుకు తగ్గించారని జవహర్ ప్రశ్నించారు.


కరోనా వైరస్ సమయంలో మద్యం రేట్లు పెంచి ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నారని జవహర్ ఆరోపించారు. మద్యం అలవాటు మానలేక.. శానిటైజర్ తాగి 50 మంది చనిపోయారన్నారు. నాణ్యత లేని బ్రాండ్లకు అనుమతులిచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. మద్యపాన నిషేధం అంటే.. మద్యం రేట్లు పెంచటం, తగ్గిoచటమేనా? అని నిలదీశారు. పెంచిన మద్యం రేట్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు..మూడు రాజధానులపై కూడా వెనక్కి తగ్గడం ఖాయమని టీడీపీ నేత జవహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement